Thursday, January 23, 2025

కెసిఆర్ దెబ్బకు ‘మహా’సర్కార్ రైతుబాట

- Advertisement -
- Advertisement -

భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) దెబ్బకు మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. ఏడాదికి రూ. 6 వేలు ఇవ్వాలని మహారాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణ యం తీసుకుంది. ఈ పథకానికి ‘షేట్కారీ మహా సమ్మాన్ యోజన’గా నామకరణం చేశారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌కు ఇది రెండో విజయంగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఔరంగబాద్ జిల్లా గంగాపూర్ తాలూ కా అంబేలోహల్ గ్రామంలో ఒకటో నంబర్ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్దార్ గఫూర్ పఠాన్ 115 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి, తొలి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం విదితమే. అయితే ఇటీవల వరుసగా మహారాష్ట్రలో నిర్వహించిన బిఆర్‌ఎస్ బహిరంగ సభల్లో రైతుబంధు అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో తెలంగాణ తరహాలో తమకూ రైతుబంధు ఇవ్వాలని మరాఠా రైతులు పోరాటం చేస్తున్నారు. షిండే సర్కార్‌పై పోరాటం చేయడమే కాకుండా.. మరాఠా రైతులు కెసిఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, భారీ స్థాయిలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికీ ఆయా పార్టీలకు చెందిన నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు గులాబీ గూటికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో షిండే సర్కార్ దిగిరాక తప్పలేదు. తెలంగాణ తరహాలోనే రైతులకు పెట్టుబడి ఇచ్చేందుకు మహా సర్కార్ నిర్ణయించింది. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.6 వేలు ఇవ్వాలని షిండే కేబినెట్ తీర్మానించింది. బిఆర్‌ఎస్ బలోపేతమవుతున్న నేపథ్యంలో రైతులను శాంతింపజేసేదుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News