Saturday, November 23, 2024

పుణెలో రాత్రి కర్ఫ్యూ

- Advertisement -
- Advertisement -

Maharashtra Govt imposes night curfew in Pune

ముంబై: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుణెలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు పుణె డివిజనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ఉండనుంది. అదేవిదంగా ఈ నెలాఖరు వరకు పుణెలో అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. బస్సులు, లోకల్ రైళ్లు, పని ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని మహారాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ రేటు రోజురోజుకు పెరుగుతోంది. కరోనా రేటు పూణే జిల్లాలో 10 శాతానికి పెరిగింది. 15 రోజుల క్రితం పాజిటివ్ రేటు 4.5 నుండి 5 శాతం మాత్రమే ఉంది. పూణేలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,97,431 కు చేరుకుంది. ప్రస్తుతం 2,561 యాక్టివ్ కేసులున్నాయి.

Maharashtra Govt imposes night curfew in Pune

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News