Wednesday, January 22, 2025

తల్లి ముందే 12 ఏళ్ల బాలికను కత్తితో పొడిచిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

ముంబయి: 20 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల బాలికను కత్తితో పలుమార్లు పొడవడంతో ఆమె మృతి చెందగా అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని కల్యాణ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆదిత్య కుంబ్లే అనే యువకుడు 12 ఏళ్ల బాలికకు ప్రేమిస్తున్నానని చెప్పాడు. ప్రేమకు ఆమె ఒప్పుకోకపోవడంతో బాలికపై పగ పెంచుకున్నాడు. తన తల్లితో కలిసి వెళ్లి తన ఇంటికి వస్తుండగా మెట్లపై తల్లిని నెట్టేసి బాలికపై ఎనిమిది సార్లు కత్తితో పొడిచాడు. వెంటనే తల్లి తెరుకొని సహాయం చేయాలని అరిచింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆదిత్య ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News