Wednesday, January 22, 2025

‘మహా’ వలసలు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉన్నది. బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనిక నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. నాటి రాజకీయాల్లో జాతీయ రాజకీయ నేతగా గుర్తింపు పొంది, పలుమార్లు కేంద్ర మంత్రిగా, రెండు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత విలాస్‌రావు దేశ్ ముఖ్ బంధువు.. సచిన్ దేశ్‌ముఖ్.. ఆదివారం నాడు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్రలో ప్రజల్లో పట్టున్న ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వీరి చేరిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. లాతూర్ జిల్లాకు చెందిన సచిన్ దేశ్‌ముఖ్ లాతూర్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. వీరితో పాటు మరో 60మంది ముఖ్య అనుచరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సచిన్ దేశ్‌ముఖ్‌తో పాటు పార్టీ లో చేరిన వారిలో రంగనాథ్ బోడ్కే, అనిల్ బెల్లాలే, మనోహర్ బన్సోడే, బాలాజీ బ న్సోడే, సద్దాం షేక్, రామేశ్వర్ హెబలే, సంతోష్ బెల్లాలే, రమేష్ గైక్వాడ్, భీమా ధుల్పావ్డే, ప్రతాప్ లోమాటే, జగన్నాథ్ డో క్, శరద్ పాయలే, కైలాష్ బిష్ణోయ్, పవన్ బోయనే, మనోజ్ జాదవ్, విక్కీ షిండే, ఆది సోమవంశీ, అభి చమే, బన్సోడే, రఘునాథ్ గోర్, సంతోష్ బెల్డేల్, శివకుమార్ చొండే, జబ్బార్ పఠాన్, షేక్ సైఫుల్లా, షేక్ అజరోద్దీన్, షేక్ మజర్, షేక్ హిజార్, షేక్ జియాద్దీన్, అజయ్ బిరాజ్దర్, షేక్ సమీముల్లా, పఠాన్ జమీర్, షేక్ ఆఫ్తాబ్, షేక్ సోహెల్, కోతింబిరే సల్మాన్, బోర్గావ్కర్ సచిన్, వాఘే అమోల్, షేక్ అబ్దుల్ భాయ్, షేక్ జబ్బార్, పవన్ బోయనే, మనోజ్ జాదవ్, విక్కీ షిండే, ఆది సోమవంశీ, అభి చామే, బాన్సోడ్, భీమా ధుల్పావ్డే, రఘునాథ్ గోర్, సంతోష్ బెల్దాలే, మాధవ్ పతంగే, సోమేష్ దేశ్‌ముఖ్, శశికాంత్ ఇంగోలు, ఎస్.వి.చ వాన్, దినేష్ గట్లేవార్, మనోజ్ జాదవ్, విక్కీ షిండే, ఆదితయ్ సోమవంశీ, పవన్ బోయిన్, విశ్వనాథ్ బన్సోడే, అభిజీత్ చమే, షేక్ అయూబ్, అజిత్ షాయద్ లాయెక్, సయ్యద్ సోయేష్, షేక్ సహబాజ్, షేక్ అమీర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎంఎల్‌ఎ బాల్క సు మన్, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నేత మాణిక్ కదం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News