Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌తోనే మహిళా వికాసం

- Advertisement -
- Advertisement -

‘అ బ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో సబ్బండ వర్గాలను ఆకర్షిస్తూ ముం దుకు సాగుతున్న బిఆర్‌ఎస్ పార్టీలో కి రాజకీయ పార్టీలు, ప్రజా లు, వృత్తి సంఘాలు అనేకం కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో సగభాగమైన మహిళలు కూ డా చైతన్యవంతమై బిఆర్‌ఎస్‌తో కలి సి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మహిళా సమస్యల మీద పోరాడుతున్న మహారాష్ట్ర కు చెందిన ప్రముఖ మహిళా సం ఘం ‘స్వరాజ్య మహిళా సంఘటన’ బుధవారం హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ లో విలీనమైంది. ఈ సందర్భంగా బి ఆర్‌ఎస్ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ స్వరాజ్య మహిళా సంఘటన అధ్యక్షురాలు వనితా తాయి గుట్టేతో పా టు స్వరాజ్య మహిళా సంఘటన సభ్యులను గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ‘స్వరాజ్య మహిళా సంఘటన’ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో మహిళాభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలు మహారాష్ట్ర నారీ లోకాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ క్రమంలో సమాజంలోని పేదలు, పీడితులు, అసహాయులు, వితంతువుల సంక్షేమం, స్వావలంబన కోసం పనిచేస్తున్న స్వరాజ్య మహిళా సంఘటన ఇక నుంచి బిఆర్‌ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని లక్ష్యంతో విలీన నిర్ణయం తీసుకున్నామని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ విధానాలను ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాలను చిత్తుశుద్ధితో పాటిస్తానని వనితా తాయి పేర్కొన్నారు. జీవితాంతం బిఆర్‌ఎస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.

బిఆర్‌ఎస్‌లో చేరిన పలు పార్టీల నాయకులు
స్వరాజ్య మహిళా సంఘటనతో పాటు మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నాయకులు. మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకుడు శంకర్న ధోండ్గే నేతృత్వంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ సమక్షంలో వారు గులాబీ కండువాలు కప్పుకొని బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అదేవిధంగా బుల్ధానా జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ అర్జున్ వాంఖడే, స్టేట్ యూనియన్ వర్కర్ (సభ్యుడు) రామ్ రావ్ షిండే పాటిల్, బిజెపి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భయ్యాసాహెబ్ పాటిల్, పంచాయతీ సమితి సభాపతి సురేష్ మిస్రవ్,శంభాజీ బ్రిగేడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మొహాలే, కార్పోరేటర్, ఎన్‌సిపి పార్టీ తాలూకా ప్రెసిడెంట్ జయంత్ చౌదరి, మహిళా అఘాడీకి చెందిన మనిషా చౌదరి, మహాగావ్ తాలూకా సభాపతి నరేంద్ర ఖదారే, శివసేన జిల్లా సచివ్ దత్తరాజ్ దేశ్ ముఖ్, లాహురావ్ మడ్కే, అషిప్ యాతల్, సునీల్ జాదవ్, సంతోష్ రాథోడ్ తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News