Sunday, December 22, 2024

అత్యాచారం కేసు పెట్టినందుకు జీవన సహచరి హత్య

- Advertisement -
- Advertisement -

పాల్ఘర్: తనతో సహజీవనం సాగిస్తున్న మహిళే తాను అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోపం పట్టలేక ఆమెను హతమార్చాడో 43 ఏళ్ల వ్యక్తి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగినట్లు మంగళవారం పోలీసులు తెలియచేశారు.

ఆగస్టు 9, 12 తేదీల మధ్య ఈ ఘటన జరిగిందని, 28 సంవత్సరాల బాధిత మహిళ మృతదేహం ఇంకా లభించలేదని పోలీసులు తెలిపారు. పాల్ఘర్‌లోని వసాయ్ ప్రాంతానికి చెందిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు వసాయ్ పోలీసు సహాయ పోలీసు కమిషనర్ పద్మజా బడే తెలిపారు.

బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగస్టు 14న నయీగావ్ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. పొరుగున ఉన్న గుజరాత్‌లోని వాపి పట్టణంలో మృతదేహాన్ని మాయం చేసి ఉంటాడని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు.

తనపై అత్యాచారం కేసు నమోదు చేసినందుకు ఆమెపై నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీన్ని ఉపసంహరించుకోవడానికి బాధితురాలు నిరాకరించడంతో ఆమెపై నిందితుడు కక్ష పెంచుకున్నాడని పోలీసులు చెప్పారు. బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదుపై నయీగావ్ పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పురికొల్పాడంటూ నిందితుడిపై వేరే పోలీసు స్టేషన్‌లో మరో కేసు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News