Wednesday, January 22, 2025

తల్లిని చంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఓ వ్యక్తి తన తల్లిని గొంతునులిమి చంపేసిన సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వైశాలి ధను అనే మహిళ తన కుమారుడితో కలిసి పుల్‌పాదా ప్రాంతంలోని గాంధీనగర్ కాలనీలో నివసిస్తున్నారు. గురువారం ఓ వివాహ వేడుకలో కుటుంబ సమస్యల నేపథ్యంలో తల్లి, కుమారుడు గొడవ పడ్డారు. అదే రాత్రి ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తల్లిని కుమారుడు గొంతునులిమి హత్య చేశాడు. వైశాలి బెడ్ మీద అచేతనంగా పడిఉండడంతో ఆమెను తల్లి ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షలో గొంతు నులిమి హత్య చేసినట్టు తేలడంతో కుమారుడి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News