Wednesday, January 22, 2025

మహారాష్ట్రలో 4వ కోవిడ్-19 వేవ్…

- Advertisement -
- Advertisement -
Covid Cases in Mharashtra rise
త్వరలో మాస్క్ లు తప్పనిసరి కానున్నాయి: ఆదిత్య థాక్రే

ముంబై: మహారాష్ట్ర పర్యావరణం,  పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఆదివారం మాట్లాడుతూ, కోవిడ్ -19 మహమ్మారి  నాల్గవ తరంగాన్ని రాష్ట్రం చూడగలదని, అయితే ప్రజలు భయపడవద్దని కోరారు. విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ -19 సంబంధిత మరణాలు పెరగడం లేదని కూడా థాకరే తెలిపారు.

ఈ పశ్చిమ రాష్ట్రంలో గత వారం రోజులుగా కోవిడ్ -19 కేసుల పెరుగుతున్నాయి.  గత నాలుగు రోజులుగా రోజువారీ సంఖ్య 1,000 మార్కుకు పైగా ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుత కేసుల పెరుగుదల ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, థానే, పాల్ఘర్ , రాయ్‌గడ్‌తో సహా నిర్దిష్ట జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉన్నదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News