Friday, February 21, 2025

30 ఏళ్ల కిందటి మోసం కేసు.. మహారాష్ట్ర మంత్రికి రెండేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

నాసిక్: దాదాపు 30 ఏళ్ల కిందటి మోసం కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కొకఠే దోషిగా తేలారు. దీంతో నాసిక్ జిల్లా కోర్టు మంత్రికి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాదు, రూ. 50 వేల జరిమానా విధించింది. మంత్రితోపాటు ఆయన సోదరుడు సునీల్ కొకఠేని కూడా కోర్టు దోషిగా తేల్చింది. జైలు శిక్షతోపాటు రూ. 50 వేలు జరిమానా విధించింది. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ కోటాలో నిర్మాణ్ వ్యూ అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌లు పొందారని మాజీ మంత్రి దివంగత టీఎస్ డిఘాలే అప్పట్లో చేసిన ఫిర్యాదుతో కోకఠే సోదరులపై కేసు నమోదైంది.

1995 నాటి ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను విచారించిన నాసిక్ జిల్లా సెషన్స్ కోర్టు కోకఠే సోదరులిద్దరినీ దోషులుగా తేల్చి గురువారం శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే శిక్ష పడిన వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. కోర్టు విచారణకు హాజరైన మంత్రి మాణిక్ రావు మాట్లాడుతూ ఈ కేసులో తనకు బెయిల్ మంజూరైందని తెలిపారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తానని చెప్పారు. ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను విచారించినట్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. తమకు సొంత ఫ్లాట్లు లేవని, ఆర్థిక స్థితి బాగోలేదని పేర్కొంటూ నకిలీ పత్రాలను సృష్టించి ఫ్లాట్లు పొందారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News