- Advertisement -
ముంబై: మనీ లాండరింగ్ కేసులో తమ మంత్రివర్గ సహచరుడు నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సిపికి చెందిన అజిత్ పవార్‌తోసహా పలువురు మంత్రులు గురువారం నాడిక్కడ ధర్నా చేశారు. రాష్ట్ర సచివాలయం మంత్రాలయ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర మంత్రులు ఇడి చర్యకు నిరసనగా ధర్నా నిర్వహించారు. శివసేన, కాంగ్రెస్‌తో కలసి ఎన్‌సిపి రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటోంది. అందరికన్నా ముందు అజిత్ పవార్ ధర్నా స్థలికి చేరుకోగా అనంతరం ఎన్‌సిపి మంత్రులతోపాటు కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, శివసేన మంత్రులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్ కూడా ధర్నా స్థలి వద్ద హాజరయ్యారు.
- Advertisement -