Wednesday, January 22, 2025

రైతు కుమారుడిని అందగత్తె పెళ్లి చేసుకోదు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రైతు కుమారుడు వివాహానికి అందవిహీనమైన అమ్మాయితోనే సరిపెట్టుకోక తప్పదని, అందమైన అమ్మాయిలు స్థిరమైన ఉద్యోగం ఉన్న వరుడినే కోరుకుంటున్నారని వరుద్-మోర్షి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మద్దతుదారు దేవేంద్ర భుయర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వరుద్ తహసిల్‌లో మంగళవారం ఒక కార్యక్రమంలో ఆయన రైతుల సమస్యలపై మాట్లాడారు. అమ్మాయి మంచి అందగత్తె అయితే నీలాంటి వాడినో లేక నాలాంటి వాడినో ఇష్టపడదు. స్థిరమైన ఉద్యోగం ఉన్నవాడినే తన భర్తగా ఆమె ఎంచుకుంటుంది. ఇక రెండవ శ్రేణికి చెందిన కొంత అనాకారి అమ్మాయిలు ఏ కిరాణా షాపు లేదా పాన్ షాపు నడుపుకునే వ్యక్తినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది.

మూడవ శ్రేణికి చెందిన అమ్మాయిలే రైతు కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అందవిహీనంగా ఉన్న అమ్మాయిలు మాత్రమే రైతు కుటుంబంలోకి వెళ్లడానికి సిద్ధపడుతుంది అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక వారికి పుట్టే సంతానం కూడా అందంగా ఉండరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మాజీ మంత్రి యశోమతి ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు భుయర్ అటువంటి భాషను ఉపయోగించడం పట్ల ఆమె అభ్యంతరం తెలిపారు. అజిత్ పవార్‌తోపాటు అధికారంలో ఉన్న వారు తమ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలని, మహిళలను ఆ విధంగా వర్గీకరించడాన్ని ఎవరూ సహించరని ఆమె తెలిపారు. సమాజమే మీకు బుద్ధి చెబుతుందని అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అయిన యశోమతి ఠాకూర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News