Wednesday, January 22, 2025

అక్రమ సంబంధం… రెండేళ్ల బాలుడిని చంపి నదిలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

ముంబయి: అక్రమ సంబంధానికి రెండేళ్ల బాలుడు అడ్డుగా ఉండడంతో బాలుడిని తండ్రి గొంతు నులిమి చంపి నదిలో పడేసిన సంఘటన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధారావిలో ఓ వ్యక్తి తన భార్య, రెండేళ్ల కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఓ ఫ్యాక్టరీలో టైలర్‌గా పని చేస్తుండడంతో అక్కడ ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్య, కుమారుడి అడ్డు తొలగించాలని చెప్పింది. ప్లాన్‌లో భాగంగా కుమారుడిని చాక్లెట్ కొనిస్తానని దుకాణం వద్దకు తీసుకెళ్లాడు.

ఎవరు లేని సమయంలో గొంతు నులిమి బాలుడిని చంపేసి రాత్రి సమయంలో మృతదేహాన్ని మీఠీ నదిలో విసిరేశాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లి తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మీటీ నదిలో బాలుడి మృతదేహం కనిపించడంతో తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను హత్య చేశానని ఒప్పుకున్నాడు. మృతదేహం ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉండడంతో తలి, చేయి భాగాన్ని ఎలుకలు కొరికాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News