Wednesday, January 8, 2025

ప్రియురాలితో పారిపోయేందుకు… తన స్థానంలో వ్యక్తిని చంపిన వృద్ధుడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఓ వృద్ధుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయేందుకు ప్లాన్ వేశాడు. ఓ వ్యక్తిని చంపి ఆ మృతదేహం తనది అని నమ్మించేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయిన సంఘటన మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్ అనే వృద్ధుడు(65) ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన ప్రియురాలితో కలిసి పారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోయినట్టుగా నమ్మించాలని ప్లాన్ వేశాడు. రవీంద్ర భీమాజీ ఘోనంద్ అనే వ్యక్తిని డిసెంబర్ 16న హత్య చేశాడు. అనంతరం మృతదేహం నుంచి తలను వేరు చేసి మొండానికి తన దుస్తులు తొడిగి తన పొలంలో పడేశాడు. సుభాస్ కుటుంబ సభ్యులు ఆ మృతదేహం సుభాష్‌దేనని భావించి అంత్యక్రియలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సిసిటివి ఫుటేజీ పరిశీలించగా హంతకుడు సుభాషేనని గుర్తించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News