Sunday, January 19, 2025

మహారాష్ట్రలో హెచ్‌3ఎన్2తో ఇద్దరు మృతి!

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత్‌లో హెచ్3ఎన్2 వ్యాధి మెల్లిగా అదుపుతప్పుతోంది. ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని నిరోధించడానికి, తగు చర్యలు తీసుకోడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు 74 ఏళ్ల వ్యక్తి. అతడు హెచ్3ఎన్2 సబ్‌టైప్ కారణంగా చనిపోయాడు. కాగా 23 ఏళ్ల ఎంబిబిఎస్ విద్యార్థి ఒకరు కొవిడ్-19, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగా చనిపోయాడు. అనుమానిత రోగులకు వెంటనే చికిత్స అందించాలని నిర్ణయించారు. డాక్టర్లను సంప్రదించకుండా తమిఫ్లు వినియోగించరాదని నిర్ణయించారు. ‘వైద్యుల సలహా మేరకు తమిఫ్లు తీసుకుంటే జ్వరం 48 నుంచి 72 గంటల్లో తగ్గిపోతుంది’ అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News