Monday, January 20, 2025

ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

గోషామహాల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదు అయ్యింది. గత శనివారం మహారాష్ట్ర షోలాపూర్‌లో జరిగిన ‘హిందూ జన్ ఆక్రోష్’ ర్యాలీలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజసింగ్.. లవ్ జిహాదీలు, గో హంతకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆయనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆయనతోపాటు ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే.. మసీదుల కూల్చివేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News