Saturday, December 21, 2024

హైదరాబాద్‌లో మీకు అన్నగా ఉంటా

- Advertisement -
- Advertisement -

సిఎం షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాములుగా మారారు
ముంబయిని దోచుకోవడానికే ప్రధాని, అదాని వస్తున్నారు బిజెపి
పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ అమలైందా? ఏడాదిలోనే 50వేల
ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఉందా? అధికారంలోకి వస్తే
మహారాష్ట్రలోనూ ఎంవిఎ కూటమి ఐదు గ్యారంటీలు అమలు చేస్తుంది
మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు చేశారా?అని ము ఖ్యమంతి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్‌నాథ్ షిండే, అజిత్ ప వార్ కాలరాశారని, వారిద్దరూ గుజరాత్ గు లాంలుగా మారారని రేవంత్ రెడ్డి అన్నారు. శ నివారం మహా రాష్ట్ర చంద్రాపూర్ నియోజవ ర్గం ఘుగూస్‌లో ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఏడాది కాలంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చా మ ని చెప్పారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రా ష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగా లు ఇవ్వలేదన్నారు. చంద్రాపూర్‌లో కాంగ్రె స్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రవీణ్‌ను గెలిపి స్తే మీకు ఇక్కడ ఒక అన్న హైదరాబాద్‌లో మ రోఅన్నగా తానుఉంటానన్నారు.మీరంతా మా సోదరులు..

ఎందుకంటే మనమంతా ఒకప్పు డు హైదరాబాద్ సంస్థానానికి చెందిన వా ళ్లమే.రాష్ట్రాలు వేరైనా మనమంతాఒకే కు టుం బం. మనమంతా కలికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో సుభా ష్ బావూను గెలిపించండి. ఛత్రపతి శివాజీ గు రించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. రా జ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, బడుగుల ఆశాజ్యోతి పూలే ఈ గడ్డపై పుట్టినవారే. దేశంలో ఉన్న ఆరు మహానగరాలు.. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ లో బీజేపీకి స్థానం లేదు. ముంబైలో కూడా బీజేపీకి స్థానం ఉండబోదు.. ముంబై నగరం మహావికాస్ అగాడీతో ఉంటుంది. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాంలు గా మారినందున ఇలాంటి వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పాలన్నారు. ముంబాయిని దోచుకోవడానికే గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ వస్తున్నారని, రైతులు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందన్నారు.

అందుకే మేం 25 రోజుల్లోనే 18వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని, తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నిరూపించామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని, ఈ వేదికగా ప్రధానికి నేను సవాల్ విసురుతున్నా..గుజరాత్ లో ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇప్పటి వరకు 1కోటి 10లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. రూ.500 లకే వంటగ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకున్నాం. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ అందించాం. ఇప్పటి వరకు 25 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని, తెలంగాణలో ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రలోనూ మహావికాస్ అగాడీ కూటమి అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేస్తుందని, ఎన్నికలు వస్తుంటాయ్.. పోతుంటాయ్..ఇప్పుడు మహారాష్ట్రలో జరిగేవి ఎన్నికలు కావు…ఇది ఒక పోరాటం అన్నారు. ఈ పోరాటంలో కూటమిని గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త ఒక వీరుడుగా మారాలని పిలుపునిచ్చారు.

మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి వాహనం తనిఖీ : చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని మహారాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. మహారాష్ట్రంలోని నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News