- Advertisement -
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. శరద్‌పవార్‌పై అజిత్‌పవార్ తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్ర ఎన్సీపిలో చీలిక వచ్చింది. అజిత్‌పవార్ 30 మంది ఎమ్మెల్యేలతో రాజ్ భవన్‌కు చేరుకున్నారు. మంత్రివర్గంలో అజిత్‌పవార్ చేరే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఆర్థిక మంత్రిగా అజిత్ పవార్ కు ఇవ్వనున్నట్టు సమాచారం. అజిత్ పవార్‌తో పాటు బిజెపి మంత్రులు రాజ్ భవన్‌కు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు అజిత్‌పవార్ ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. శరద్‌పవార్ తన కూతురు సుప్రియకు పార్టీలో కీలక పదవి ఇచ్చారు. అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో ఎన్ సిపి పార్టీగా రెండుగా చీలింది.
Also Read: ఆ ప్రాంత ఎంఎల్ఎలతో సిఎం కెసిఆర్ భేటీ
- Advertisement -