Monday, January 20, 2025

వివాహేతర సంబంధం.. వదిన, పిల్లలను చంపి ఇంటి ముందే తగలబెట్టాడు…

- Advertisement -
- Advertisement -

ముంబయి: వివాహేతర సంబంధం పెట్టుకుందని వదిన, ఆమె పిల్లలను మరిది గొంతు నులిమి చంపి అనంతరం బెడ్ షీట్ లో మృతదేహాలను మూట కట్టి ఇంటి ముందే తగలబెట్టిన సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోండ్వా ప్రాంతంలో వదిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో మరిది తన వదినకు వివాహేతర సంబంధం వద్దని పలుమార్లు హెచ్చరించాడు. ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె, ఆమె పిల్లలను గొంతు నులిమి చంపాడు. అనంతరం మృతదేహాలను బెడ్ షీట్‌లో మూట కట్టి ఆమె ఇంటి ముందు ఉన్న షెడ్‌లో పడేశాడు. మృతదేహాలపై కర్రలు వేసి తగలబెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News