Thursday, January 23, 2025

ప్రియురాలి కుమారుడిని వేడి నీళ్లలో ముంచి… హత్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రియురాలు తనని పెళ్లి చేసుకోవడంలేదని ఆమె కుమారుడిని వేడి నీళ్లలో ముంచి హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఖేడ్ ప్రాంతంలో విక్రమ్ శరద్ కోలేకర్ అనే వ్యక్తి వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి తనని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ప్రియురాలిని అడుతుండడంతో ఆమె వ్యతిరేకిస్తుంది. ఏప్రిల్ 6న తన కుమారుడిని ప్రియుడు వద్ద ఉంచి బయటకు వెళ్లింది. వేడి నీళ్లలో బాలుడిని ముంచి బయటకు తీశాడు. బాలుడు తీవ్ర గాయాలు కావడంతో ఏప్రిల్ 6న ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు విక్రమ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ప్రియురాలు తనని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోకపోవడంతో తానే హత్య చేశానని నిజాలను ఒప్పుకున్నాడు.

Also Read: చంపిన వ్యక్తి కలలోకి వచ్చి కలవరపెడుతున్నాడని…. పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News