Friday, December 20, 2024

వారసుడు లేడని వేధింపులు… భర్తను భార్య ఏ చేసిందో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఇంటికి వారసుడు లేడని భార్యను భర్త వేధించడంతో అతడిని మరో ఇద్దరుతో కలిసి భార్య హత్య చేయించిన సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అకుడి ప్రాంతంలో దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. కుమారుడికి జన్మనివ్వలేదని భార్యను భర్త పలుమార్లు వేధించాడు. వేధింపులకు ఎక్కువ కావడంతో అతడిని చంపేయాలని భార్య నిర్ణయం తీసుకుంది. తన భర్తను చంపితే రెండు లక్షల రూపాయల సపారీ ఇస్తానని అమన్ పుజారీ, శివమ్ దూబేకు తెలిపింది. గత డిసెంబర్ 7న తల్లి తన చిన్న కూతురుతో బయటకు వెళ్లినప్పుడు అమన్, శివమ్ వాళ్లంటికి వెళ్లారు. రాత్రి 9.30 తండ్రి ఎక్కడ అని కూతురిని అమన్, శివమ్ ప్రశ్నించడంతో నిద్ర పోతున్నాడని సమాచారం ఇచ్చింది. ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. 30 నిమిషాల తరువాత తండ్రి రూమ్‌లో నుంచి శబ్దాలు రావడంతో అక్కడికి వెళ్లేసరికి తండ్రిని ఆ దుండగులు కత్తులతో పొడిచి చంపుతున్నారు.

తండ్రి రక్తపు మడుగులో కనిపించడంతో వారిని పట్టుకోవడానికి కూతురు ప్రయత్నించింది. ఇద్దరు కలిసి ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి దుండగులు తప్పించుకున్నారు. వెంటనే స్థానికుల సహాయంతో తండ్రిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయాడని సమాధానం ఇచ్చారు. కూతురు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను పట్టుకొని ప్రశ్నించగా భార్యే భర్తను చంపించిందని వారు ఒప్పుకున్నారు. గతంలో కూడా తన భర్తకు విషం పెట్టి చంపాలని నిర్ణయం తీసుకున్నానని భార్య ఒప్పుకుంది. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News