Monday, January 20, 2025

మొబైల్ హాట్‌స్పాట్ నుంచి నెట్ కనెక్షన్ ఇవ్వలేదని నరికి చంపారు

- Advertisement -
- Advertisement -

ముంబయి: మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా నెట్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఒక వ్యక్తిని నలుగురు వేటకోడవలితో నరికి చంపిన సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… వాసుడో రామచంద్ర కులకర్ణి అనే వ్యక్తి లోన్ ఎజెంట్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి 10.30 నిమిషాలకు తన ఇంటికి సమీపంలో రామచంద్ర సరదాగా వాకింగ్ చేస్తున్నాడు. నలుగురు మద్యం మత్తులో రామచంద్ర వద్దకు వచ్చి మొబైల్ హాట్ స్పాట్ ద్వారా డాటాను ఇవ్వమని అడిగారు. వారు మద్యం మత్తులో ఉండడంతో రామచంద్ర తిరస్కరించాడు. దీంతో అతడితో నలుగురు మద్యం బాబులు గొడవకు దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో వేటకోడవలితో అతడిని నరికేశారు. రక్తపు మడుగులో ఒక వ్యక్తి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతుడితో నలుగురి పరిచయం లేదని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News