- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని పుణేలో బస్సులో యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పార్కింగ్ చేసిన బస్సులో యువతిపై రామ్‌దాస్(36) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. శ్రీరూర్‌లోని చెరుకు తోటలో రామ్‌దాస్ దాక్కున్నట్టు తెలియడంతో పోలీసులు డ్రోన్లు, జాగిలాల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం అర్థరాత్రి నిందితుడికి ఆకలేసి ఒక ఇంటికి వెళ్లి అడిగాడు. సదరు వ్యక్తి రామ్‌దాస్‌ను గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -