మహారాష్ట్రలో కరోనా తీవ్రస్థాయి
ఒక్కరోజే 31,855 మందికి వైరస్
ముంబై: మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 31,855 మందికి కరోనా సోకింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కొవిడ్ కేసులు రికార్డు కాలేదు. దేశంలో కరోనా మహమ్మారి ఆరంభం నాటి నుంచి చూస్తే ఇన్ని కేసులు ఒకే రోజు నిర్థారణ కావడం అత్యధిక రికార్డు అయింది. దాదాపుగా 32వేల స్థాయికి కరోనా కేసులు చేరడం, ఒక్కరోజే కరోనాతో 95 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా తీవ్రత స్పష్టం అయింది. ఈ రోజే 15,098 మంది కరోనా నుంచి ఉపశమనం పొంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య అధికారుల గణాంకాలతో స్పష్టం అయింది. కరోనా తీవ్రస్థాయి లక్షణాలతో ఉన్న యాక్టివ్ కేసులు బుధవారానికి రాష్ట్రంలో 2,47,299కు చేరాయి. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజు 30,535 మందికి కరోనా వచ్చింది. మంగళవారం ఈ కేసుల సంఖ్య దాదాపు 29వేలుగా ఉంది.
Maharashtra reports 35855 new Covid cases in single day