Wednesday, December 25, 2024

టైలర్ షాపులో అగ్నిప్రమాదం: ఊపిరాడక ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దానా బజార్‌లోని కంటోన్మెంట్‌లో ఓ టైలరింగ్ షాపుకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటలలో ఊపిరాడక ఏడుగుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ప్రజలు నివాసం ఉండే స్థలంలో ట్రైలరింగ్ షాపును గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంచారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇవాళ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మంటలు అంటుకోవడంతో ఫస్ట్ ఫ్లోర్‌కు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఊపిరాడక ఎనిమిది చనిపోయారు. మృతులలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా తెలిపాడు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. మంటలు ఎలా వ్యాపించాయి అనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News