Monday, January 20, 2025

నాగపూర్ చారిత్రక గుణపాఠాలు

- Advertisement -
- Advertisement -

నాగపూర్ మహారాష్ట్ర శీతాకాల రాజధాని. సుందర ప్రాచీన భవనాల్లో శాసనసభ భవనం, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల, మంత్రుల, ప్రతిపక్ష నాయకుల, శాసన సభ్యులకార్యాలయా లు, నివాసాలు, ముంబయి హైకోర్టు నాగపుర్ పీఠం, ఆర్‌బిఐ కార్యాలయం ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం పేరు హైదరాబాద్ హౌస్. పాత సుందర శాసనసభకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ భవనాల నిర్వహణ ఖర్చు కోట్లలో ఉంటుంది. మధ్యధరా శీతోష్ణ ముంబయి లో వేడి పెరిగి చలి తగ్గింది. శీతాకాల రాజధాని, పాలితులకు లేని సౌకర్యాలు పాలకులకు అవసర మా? ఈ భవనాలను ఇతరాలకు వాడుకొని ప్రజాధనాన్ని పొదుపు చేయవచ్చు.

నాగపూర్ భారత భౌగోళిక మధ్య కేంద్రం. బ్రిటిష్ సెంట్రల్ ప్రావిన్స్ రాజధాని. ఆ ప్రభుత్వం దీన్ని ఇండియా జీరో మైల్‌గా గుర్తించింది. ఇది కమలా పండ్ల నగరం. పులుల రాజధాని. నగరం చుట్టూ పులుల సంరక్షణ కేంద్రాలున్నాయి. నాగపూర్ నాగజాతి ప్రజల నగరం. (కృష్ణుడు అర్జునునితో చంపించిన నాగులు వీరే) ఆర్యుల ప్రత్యర్థులైన నాగుల పేరునే పాత నగరంలో పారే నదికి, ఈ నగరానికి పెట్టారని అంబేడ్కర్ వాదన. నాగజాతి బుద్ధ బోధనలను దేశమంతా ప్రచారం చేసింది. అందుకే అంబేడ్కర్ బౌద్ధ దీక్షకు నాగపూర్‌ను ఎంచుకున్నారు. తన రెండవ భార్య డాక్టర్ సవిత (శారద కృష్ణారావు కబీర్)తో సహా 3 లక్షల 65 వేల అనుచరులతో బుద్ధిజానికి మారారు. అక్కడిబోలు బుద్ధ స్థూపం ప్రపంచ బోలు స్థూపాలలో పెద్దది. దీక్షాభూమిగా, పర్యాటక స్థలంగా ప్రసిద్ధిగాంచింది.

మహారాష్ట్ర ఆరు పరిపాలన మండళ్ళ (డివిజన్ల)లో విదర్భ ప్రాంత నాగపూర్, అమరావతి మండళ్ళున్నాయి. నాగపూర్ మహారాష్ట్ర శీతాకాల రాజధాని. సుందర ప్రాచీన భవనాల్లో శాసనసభ భవనం, గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల, మంత్రుల, ప్రతిపక్ష నాయకుల, శాసన సభ్యులకార్యాలయాలు, నివాసాలు, ముంబయి హైకోర్టు నాగపుర్ పీఠం, ఆర్‌బిఐ కార్యాలయం ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం పేరు హైదరాబాద్ హౌస్. పాత సుందర శాసనసభకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ భవనాల నిర్వహణ ఖర్చు కోట్లలో ఉంటుంది. మధ్యధరా శీతోష్ణ ముంబయిలో వేడి పెరిగి చలి తగ్గింది.

శీతాకాల రాజధాని, పాలితులకు లేని సౌకర్యాలు పాలకులకు అవసరమా? ఈ భవనాలను ఇతరాలకు వాడుకొని ప్రజాధనాన్ని పొదుపు చేయవచ్చు. నగరంలో పచ్చని చెట్లతో చాలా పార్కులున్నాయి. కస్తూర్ చంద్ పార్క్, అమర సేనాని మేజర్ సురేంద్ర మధుసూదన్ దేవ్ పార్కు, బాలుర, ట్రాఫిక్ పార్కులు, సెమినార్ కొండపై జపాన్ పార్కు మేము చూసిన పార్కులు. ఇవిగాక వీధి జిమ్ములు, వ్యాయామ శాలలు, జిమ్ములతో క్రీడా ప్రాంగణాలున్నాయి. ప్రత్యేక మందిరాల్లో రాం, హనుమాన్, రాందేవ్ కేంద్రాలతో ఇవన్నీ పాక్షికంగా కాషాయీకరించబడ్డాయి. వాకింగ్ స్ట్రీట్‌లో ప్రోత్సాహకర సత్సూత్రాలతో విగ్రహాలను ప్రతిష్టించారు. సాంస్కృతిక కేంద్రాలు, అన్ని మతాలయాలు, జనరల్ పోస్ట్ ఆఫీస్ లాంటి పురాతన భవనాలు, 1817లో ఆంగ్లేయులతో యుద్ధం జరిగిన చారిత్రక ప్రసిద్ధ సీతా బర్ది కొండపై కోట ఉన్నాయి. కోటను సైనిక కార్యాలయాలుగా ఉపయోగిస్తున్నారు. జాతీయ పర్వదినాల్లో ప్రజలు కోటను చూడవచ్చు.

ప్రజాపనుల శాఖ కార్యాలయంలో ప్రాచీన పనిముట్ల, యాంత్రిక వాహనాలను ప్రదర్శించారు. మునిసిపల్ కార్పొరేషన్ రహదారులను సుందరంగా నిర్వహిస్తోంది. నడుములను విరగ్గొట్టే గుంతల, అతుకుల రోడ్లులేవు. రోడ్లకు ఇరువైపులా చెట్లు, కాలిబాటలున్నాయి. వేసవిలో సిగ్నళ్ళ వద్ద ఆగినవారికి ఎండతగలకుండా ఆకుపచ్చ బట్టల పందిర్లు కట్టారు. రోడ్లను, మురుగు కాలువలను రోజూ శుభ్రపరుస్తారు. వర్షాకాలం ముందు కాలిబాటల కిందున్న మురుగు కాలువల్లో అడ్డాలను తొలగిస్తారు. మురుగు కాలువలు కనిపించకుండాసూక్తులను రాసిన మందపు ఆకుపచ్చ బట్టతో లేదా కృత్రిమ గడ్డితో తెరలను స్థాపించారు. తాత్కాలిక, ఒప్పంద మునిసిపల్ కూలీలు లేరు. రూ.17,500 మూల వేతనంతో రూ.29 వేల కనీస జీతాల శాశ్వత మునిసిపాలిటి ఉద్యోగులే. నాగపూర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపక కేంద్రం. అక్కడ గట్టి భద్రత ఏర్పాట్లున్నాయి. సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మోహన్ భాగవత్ అక్కడే ఉంటారు. లోపల ఒక ప్రదర్శనశాల, బయట కరసేవకుల సమావేశ స్థలం ఉన్నాయి. ఇక్కడ రోజూ ఉదయం కరసేవకులు సమావేశమవుతారు.మరొక విశాల స్థలంలో హెడ్గేవార్ స్మారక భవనం ఉంది.

దీనికి ఆనుకొనిఉన్న కళాశాలల క్రీడా స్థలాలను వాడుకుంటారు. హెడ్గేవార్ స్మారక భవనంలో హెడ్గేవార్, గోళ్వాలకర్‌ల సమాధులున్నాయి.ఈ భవనంలో రోజూ స్వదేశ, విదేశ సంఘ్ పరివార్ కార్యకర్తలకు, ప్రచారకులకు శిక్షణ ఇస్తారు. రెండువేల మంది కూర్చునే వీలుగా సమావేశ మందిరం, సరిపడా భోజనశాల ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాలలో చెప్పులు విప్పి వెళ్ళాలి. చెప్పులను అడ్డదిడ్డంగా గాక వరుసల్లో పెడతారు. రెండు చోట్ల సంఘ్ కార్యకర్త దర్శకులకు ప్రదేశాలను చూపిస్తారు. నాగపూర్‌లో ఆడపిల్లలకూ కర్రసాము వ్యాయామ శిక్షణ ఇస్తున్నారు. కమ్యూనిస్టు యోధుడు అర్ధెందు భూషణ్ బర్దన్ నాగపూర్ కేంద్రంగా పని చేశారు. నాగపూర్ దళిత బౌద్ధ కేంద్రం. నగరంలో ప్రజాప్రయాణ సౌకర్యాలకు ప్రభుత్వ బస్సులు, మెట్రో రైలు ఉన్నాయి. కార్పొరేషన్ కొళాయిల వీధి మంచి నీటి వసతి కల్పించింది. ఈ నగరం సువ్యవస్థిత విద్య, ప్రజారోగ్య సంరక్షణ కేంద్రం. స్వచ్ఛ భారత్ పథకం కింద 2018 లో బహిరంగ మలవిసర్జన ముక్తనగరంగా ప్రకటించారు.నాగపూర్ నిరాధారుల నరకం. 1994లో 50 వేల గొవారి (పశులకాపరి) జాతి ప్రజలు ఎస్‌టి హోదా కోరుతూ నాగపూర్ శాసనసభ వద్ద దివిటీలతో నిరసన తెలిపారు.

పోలీసుల అమానవీయ కాల్పుల్లో అధికార లెక్కల ప్రకారం 114 మంది చనిపోగా, 500 మంది గాయపడ్డారు. మోడీ సర్కారు 150 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో నాగపూర్‌లో ఎటిఎం, బస్, రైలు టిక్కెట్ల బుకింగ్, ఫోన్ సేవల నగర కియోస్కులను ప్రారంభించింది. నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రజలకు ఇవి అనవసరం. అందువలన ఇవి వికలాంగుల, భిక్షకుల నిద్రా స్థలాలుగా, మరుగుదొడ్లుగా మారాయి. స్వచ్ఛ భారత్ వంకలో కలిసింది. వికలాంగుడు నిద్రిస్తున్న కియోస్కు ప్రక్కనే ఆకాశవాణి ఉంది. హైకోర్టు, విధానసభ చెరొక వైపు 200 మీటర్ల దూరంలో, దివ్యాంగుల నమోదు కేంద్రం ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ మెట్రో స్టాప్ వద్ద రెండు చోట్ల ఏ ఆచ్ఛాదన లేని మురికివాడలో రెండు కుటుంబాలు పసిపిల్లలతో పాటు నివసిస్తున్నాయి. వారికి స్నానాల గదులు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేవు. అక్కడే కట్టెల పొయ్యి మీద వండుకొని తింటున్నారు.

వీళ్ళు పగలంతా తక్కువ కూలికి కష్టపడి పని చేస్తారు. దేశోత్పత్తికి సాయపడతారు లేదా రోడ్ల కూడళ్ళలో చిన్నవస్తువులు అమ్ముకొని బతుకుతారు. మురికి గుడ్డల గుట్టలు వీళ్ళ నివాసాల పక్కనే ఉన్నాయి. మునిసిపల్ కార్మికులు ఈ ప్రదేశాలను, కియోస్కు దొడ్లను పట్టించుకోరు. ఓట్లు లేని ఈ దిక్కులేని వారిని వేల కోట్లు ఖర్చుపెట్టిన పదేళ్ళ స్వచ్ఛ భారత్, స్వయం సేవకులు, సుపరిపాలకులు పట్టించుకోలేదు. అక్కడే పుట్టి పెరిగినా పౌరసత్వంలేని వీరికి ఇళ్ళతో సహా ఏ ప్రభుత్వ పథకమూ రాదు. వ్యవసాయ విద్యాలయం దగ్గర ధ్యానచంద్ హాకీ ఆటస్థలం తర్వాత రోడ్డుకు ఇరువైపులా కాలిబాటలపైనే పేదలు నివాసాలనుఏర్పర్చుకున్నారు. విధానసభ చౌక్‌లో రెండు, మూడు భిక్షక కుటుంబాలు కాలిబాటలపైన, ట్రాఫిక్ ఐలాండ్‌లో రాత్రులు నివాసముంటాయి. అక్కడే మూత్రమలవిసర్జన చేస్తాయి. భారత పాలకులు, పాలితులు నాగపూర్ నాకనరకాల నుండి గుణపాఠాలు నేర్వాలి. సుపరిపాలన, సుపౌరసత్వం అభివృద్ధి చేయాలి.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News