Wednesday, January 22, 2025

మహారాష్ట్ర సచివాలయంలోకి ప్రజలకు అనుమతి

- Advertisement -
- Advertisement -

Maharashtra Secretariat Reopens for Public

ముంబై: కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో లేని మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయ బుధవారం మళ్లీ సామాన్య ప్రజల సందర్శనార్థం తెరుచుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మంత్రాయలోకి ప్రజలను అనుమతించనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2020 మార్చిలో కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పచివాలయంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మంత్రాలయలో ప్రజల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న మహారాష్ట్ర ప్రభుత్వం మాస్కు ధారణతోపాటు కొవిడ్ ఆంక్షలన్నిటీ ఎత్తివేసింది. గత ఏడాది నవంబర్‌లో వెన్నెముక ఆపరేషన్ చేసుకున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మొట్టమొదటిసారి ఏప్రిల్ 13న సచివాలయాన్ని సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News