Monday, December 23, 2024

మహారాష్ట్రలో రెండు వంతెనల పేర్లు మార్పు

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర లోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం బుధవారం రెండు వంతెనల పేర్లు మార్చింది. వెర్సోవాబాంద్రా సీలింక్ కు వీడీ సావర్కర్ సేతుగా నామకరణం చేసింది. అలాగే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌కు మాజీ ప్రధాని వాజ్‌పాయ్ స్మృతి నవసేన అటల్ సేతు అని పేరు ఖరారు చేసింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావు లేదన్నారు. వెర్సోవాబాంద్రా సీ లింక్‌కు సావర్కర్ పేరు పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి షిండే గత నెలలోనే ప్రకటించారు.

తీర ప్రాంతంలో 17 కిమీ మేర నిర్మిస్తున్న వెర్సోవాబాంద్రా సీలింక్… అందేరీని బాంద్రావర్లి సీలింకుతో అనుసంధానం చేయనుంది. అలాగే నవీ ముంబైని ముంబైకి అనుసంధానం చేసే ఎంటిహెచ్‌ఎల్ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. దీంతోపాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిరావ్ పూలే జన్ ఆరోగ్య యోజన పథకం పరిధిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడంతోపాటు రాష్ట్రం లోని ప్రజలందరికీ అందజేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి షిండే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News