Sunday, January 19, 2025

ఎంత పని చేశాడు…. ఆ సినిమాలు చూస్తున్నాడని…. కుమారుడిని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

ముంబయి: అశ్లీల చిత్రాలు వీక్షిస్తున్నాడని చెప్పి కుమారుడికి తండ్రి విషం ఇచ్చి చంపిన సంఘటన మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విజయ్ బట్టు అనే వ్యక్తి దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడి కుమారుడు విశాల్ (14) స్థానిక పాఠశాలలో చదువుకునేవాడు. ఫోన్ ఇంట్లో నుంచి తీసుకెళ్లి స్కూల్‌లో అశ్లీల చిత్రాలు చూసేవాడు. దీంతో ఉపాధ్యాయులు పలుమార్లు సదరు విద్యార్థిని మందలించడంతో పాటు తల్లిదండ్రులకు చెప్పారు. విద్యార్థిలో మార్పురాకపోవడంతో తండ్రి ఆహారం విషం కలిపి కుమారుడికి ఇచ్చాడు. విద్యార్థి ఆహారం తిని చనిపోయిన తరువాత మృతదేహాన్ని దగ్గరలోని మురికి కాలువలో పడేశాడు.

ఏమీ తెలియనట్టుగా భార్యతో కలిసి కుమారుడితో కోసం తండ్రి వెతికాడు. దీంతో కుమారుడు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విశాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా మురికి కాలువలో అతడి మృతదేహం కనిపించింది. విజయ్ చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమాన వచ్చింది. దీంతో పోలీసులకు దొరికిపోతాననే అనుమానంతో జరిగిన విషయం భార్యకు చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News