Tuesday, December 24, 2024

ఖార్కివ్‌లో చిక్కుకున్న మహారాష్ట్ర విద్యారుల మొర!

- Advertisement -
- Advertisement -

Maharashtra students trapped in Kharkiv

 

ఔరంగాబాద్: ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్‌లో యుద్ధం కొనసాగుతోంది. అక్కడ అనేక మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వారంతా నీటి కోసం, ఆహారం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి వేగంగా తరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వీలయినంత త్వరగా అక్కడి నుంచి భారత్‌కు తరలించాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు చేసుకుంటున్నారు. ఖార్కివ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు మహారాష్ట్ర విద్యార్థులు నీటి కోసం పెద్ద క్యూలో నిలుచుంటున్నామని, సోడాలు తాగుతూ బంకర్లలో ఉంటున్నామని, బాంబు మోతల మధ్య ఆహారం కోసం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటికి వస్తున్నామని వివరించారు. “కొన్ని నెలల కిందటే నేను ఖార్కివ్ నగరానికి చేరాను” అని హృతిక్ బపులోహర్ చెప్పారు.

అతడికి సీనియర్ అయిన ఐశ్వర్య పాటిల్ మహారాష్ట్రలోని సాంగ్లి నుంచి ఉక్రెయిన్ వచ్చింది. ఖార్కివ్ హాస్టల్‌లో నీటి నిల్వ వేగంగా తరిగిపోతోందని ఆమె తెలిపారు. “మేము సోడా తాగి దప్పిక తీర్చుకుంటున్నాము. 5లీటర్ల నీటి కోసం మేము 2కిమీ. లైన్‌లో నిలబడాల్సి వస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆహార పదార్థాల ధరలు మూడు రెట్లు పెరిగిపోయాయి. ఫుడ్ ఐటమ్స్ కొనడానికి రిస్క్ తీసుకుని బయటికి వస్తున్నాము. బాంబు పేలుళ్లు జరుగుతున్నందున మేము దాక్కొని ఉంటున్నాము. మేము పాస్టా, ఇతరములు వండుకుని తింటున్నాము. వండుకోడానికి మాకు రాత్రుల్లో గంట సమయాన్ని మాత్రం అధికారులు ఇస్తున్నారు. మేము మొబైల్ ఫ్లాష్ లైట్లు ఉపయోగించి వండుకుంటున్నాము” అని ఆమె తెలపారు. “ఒకవేళ మమ్మల్ని తరలించడం ఆలస్యమైతే కమ్యూనికేషన్ కూడా సాధ్యపడదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు జరగదని మాతో అన్నారు. కానీ అది మొదలయింది. భారత ప్రభుత్వం, రష్యాతో మాట్లాడి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాలి” అని ఐశ్వర్య పాటిల్ చెప్పుకొచ్చింది.

ఖార్కివ్ బంకర్లలోనే ఉండాలని విద్యార్థులు, ఇతర భారతీయులకు చెప్పారు. మమ్మల్ని 20 మంది గ్రూపుగా ఏర్పడమన్నారు. మమ్మల్ని ఇక్కడి నుంచి ఎప్పుడు స్వదేశానికి తరలిస్తారో తెలియడంలేదు. విద్యార్థులను పొలాండ్‌కు వెళ్లమన్నారు. కానీ ఖార్కివ్‌కు పొలాండ్‌కు మధ్య ఉన్న దూరం 1,500 కిమీ. ఇప్పుడున్న పరిస్థితిలో అంత దూరం వెళ్లడం అసాధ్యం. మా మిత్రులు చాలా మంది మెట్రో స్టేషన్లలో చిక్కుబడి ఉన్నారు” అని సాంగ్లికే చెందిన శివాంజలి యాదవ్ తెలిపారు. తమని రష్యా సరిహద్దు నుంచి తరలించడం ఈజీ కాగలదని, ఎందుకంటే అక్కడ నుంచి దూరం తక్కువ అని ఆమె తెలిపారు. తమకు భారతీయ ఎంబసీ నుంచి సరైన సమాధానం రావడంలేదని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News