Friday, December 20, 2024

భర్త మృతదేహానికి రాయికట్టి బావిలో పడేశారు..

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపి అనంతరం మృతదేహానికి రాయితో కట్టి బావిలో పడేసిన సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….దొంబివాలిలో చంద్రప్రకాశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సుమతి విశ్వకర్మ అనే వ్యక్తితో చంద్ర ప్రకాశ్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య తన ప్రియుడితో కలిసి భర్త గొంతుకోసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులోకి తీసుకెళ్లి శవానికి రాయి కట్టి బావిలో పడేశారు. తరువాత తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఆమెపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. బావిలో తేలుతున్న మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News