Monday, December 23, 2024

ప్రిన్సిపాల్‌ను పొడిచిన టీచర్ భర్త

- Advertisement -
- Advertisement -

ముంబయి: భార్యకు సంబంధించిన సర్వీస్ రికార్డు ఇవ్వలేదని ప్రిన్సిపాల్‌ను కత్తితో భర్త పొడిచిన సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..దొంబివ్లిలో షకిల్ హుమాయన్ షేక్ అనే వ్యక్తి భార్య ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేసింది. సర్వీస్ రికార్డు ఇవ్వాలని పలుమార్లు ఆమె స్కూల్ ప్రిన్సిపాల్‌ను అడిగింది. అతడు ఇవ్వకపోవడంతో ఆమె భర్త షకిల్ రంగంలోకి దిగాడు. ఖర్బో రైల్వే స్టేషన్ సమీపంలో ప్రిన్సిపాల్ నడుచుకుంటూ వెళ్తుండగా షకిల్ అతడిని కలిశాడు. తన భార్యకు సంబంధించిన సర్వీసు రికార్డు ఇవ్వాలని కోరాడు. సర్వీసు బుక్ కనిపించకపోవడంతో ఇవ్వలేకపోతున్నానని ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. కోపంతో రగిలిపోయిన షకిల్ కత్తి తీసుకొని ప్రిన్సిపాల్‌ను పలుమార్లు పొడిచాడు. అతడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని షకిల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రిన్సిపాల్ ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News