Monday, December 23, 2024

దంపతుల మధ్య గొడవ…. 18 నెలల పసికందును నెలకేసి కొట్టి

- Advertisement -
- Advertisement -

థానే: దంపతుల మధ్య గొడవ జరగడంతో 18 నెలల కూతురును నెలకేసి కొట్టడంతో ఆమె మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డయగర్‌గఢ్‌లోని అభయ్‌నగర్‌లో అల్టాఫ్ మహ్మాద్ సిమిల్లా అన్సారీ (26) తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. దంపతులకు 18 నెలల కూతురు ఉంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంలో కూతురును నెలకేసి కొట్టాడు. దీంతో పసికందు ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపిసి సెక్షన్ 302, 325 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News