Monday, January 20, 2025

మళ్లీ మహా పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నా రు. అత్యంత ప్రజాదరణ కలిగిన దళితనేత, సామాజిక వేత్త అన్నాబావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో సిఎం కెసిఆర్ పా ల్గొంటారు. ఆగస్టు 1వ తేదీన మహారా ష్ట్ర సాంగ్లీ జిల్లా వార్వా తహశీల్ వాటేగావ్ గ్రామంలో జరిగే అన్నాభౌ సాఠే 103వ జయంతి ఉత్సవాల్లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పాల్గొంటారు. మాతం గ సామాజికవర్గానికి చెందిన అన్నాబా వ్ సాఠే అసలు పేరు తుకారాం బాపు రావ్ సాఠే. అన్నాబావ్ దళిత ఉద్యమ నాయకుడు, సామాజికవేత్త. స్వతహా గా కవి, రచయిత కూడా. సాఠే 35కు పైగా నవలలు రాశారు. మరాఠా మాండలికంలో సాగిన సాఠే రచనల్లో ఫకీరా అత్యంత ప్రజాదరణ పొందింది. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఒక యువకుని జీవనగాథ ఆధారంగా రూ పొందిన ఫకీరాకు 1961లో రాష్ట్ర ప్ర భుత్వం నుంచి ఉత్తమ నవల పురస్కారాన్ని పొందింది. రష్యాలోని మాస్కో నగరంలోని మార్గరీటా రుడోమినో అల్ రష్యా స్టేట్ అంతర్జాతీయ సాహిత్య గ్రంధాలయం దగ్గర లోక్షాహిర్ అన్నాబావ్ సాఠే విగ్రహాన్ని స్థాపించారు. అన్నాబావ్ సాఠే స్మృతి దివస్‌లో పాల్గొన్న తరవాత బిఆర్‌ఎస్ అధినేత అక్కడి నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ తరవాత ఆయన సాంగ్లీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్హాపూర్‌కు చేరుకుని, అక్కడ కొలువైన మహాలక్ష్మిఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణ శకం 7వ శతాబ్దంలో చాళుక్య వంశ రాజు కరణ్ దేవ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలోని 108 శక్తి పీఠాల్లో కొల్హాపూర్ మహాలక్ష్మిఆలయం ఒకటి. కొల్హాపూర్లో దేవీ అంబాబాయి దర్శనం తరువాత కెసిఆర్ ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News