Wednesday, January 22, 2025

మరో15-20 రోజుల్లో కూలనున్న మహారాష్ట్ర ప్రభుత్వం: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -
సంకీర్ణ ప్రభుత్వానికి ‘డెత్ వారెంట్ ’ జారీ!

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మహారాష్ట్రలో మరో 1520 రోజుల్లో కూలిపోనున్నదని శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఆదివారం జోస్యం చెప్పారు. అజిత్ పవార్ తాలూకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి), శివసేన(యుబిటి) చర్చలు జరుపుతున్నాయన్నారు. అయితే అజిత్ పవార్ ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నారని తెలిపారు. బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఫిబ్రవరిలోనే పతనం కావలసింది, కానీ ‘సేన వర్సెస్ శివసేన’ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కాస్తా ఆలస్యం అయిందన్నారు.

‘షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయింది. ఇక కేవలం తేదీ తెలియాల్సి ఉంది. షిండే ప్రభుత్వం కూలిపోతుందని నేను ఫిబ్రవరిలోనే చెప్పాను. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా అది కాస్త నిదానించింది. ప్రభుత్వానికి మరికొన్ని రోజులు బతికే అవకాశం దొరికింది. అయినా సరే ఆ ప్రభుత్వం మరో 1520 రోజుల్లో కూలిపోతుంది’ అని రాజ్యసభ ఎంపీ అయిన సంజయ్ రౌత్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News