Saturday, November 23, 2024

షిండే వర్గంలో తిరుగుబాటు..

- Advertisement -
- Advertisement -

ముంబై : ముఖ్యమంత్రి షిండే వర్గపు శివసేన ఎమ్మెల్యేలు కొందరు ఇప్పుడు తమతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారని ఉద్దవ్ థాకరే వర్గం శివసేన యుబిటి వెల్లడించింది. ఎన్‌సిపిని వీడి ఇటీవలే అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో తన బృందంతో కలిసి చేరారు. తాను ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు.ఈ పరిణామంతో ఇక షిండే ముఖ్యమంత్రి పదవి ఊడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యుబిటి నేత వినాయక్ రౌత్ షిండే వర్గం ఎమ్మెల్యేలు తమతో టచ్‌లోకి వచ్చినట్లు తెలిపారు. అజిత్ పవార్ ప్రభుత్వంలో వచ్చి చేరిన మరుక్షణం నుంచే వీరి నుంచి తమకు తగు రాయబారాలు అందుతున్నాయనిరౌత్ చెప్పారు.

ఇంతకాలం కడుపులో చల్లకదలకుండా ఉన్నట్లుగా ఉన్న షిండేకు ఇప్పుడు కలవరం పట్టుకుందని, ఇప్పటికే షిండే శిబిరంలో తిరుగుబాటు ఆరంభం అయిందని వినాయక్ రౌత్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సందేశాలలో తాము ఉద్ధవ్ అధికార నివాసం , ప్రతీక అయిన మాతోశ్రీ తరఫున తమను క్షమించామనే మాట రావాలని, అటువైపు రావడానికి సిద్ధమని చెప్పినట్లు వినాయక్ తెలిపారు. అయితే వినాయక్ వాదనను రాష్ట్ర మంత్రి షిండే వర్గానికి చెందిన ఉదయ్ సామంత్ తోసిపుచ్చారు. నిజానికి ఉద్ధవ్ శిబిరానికి చెందిన వారే తమ వద్దకు వచ్చేందుకు సిద్ధం అయ్యారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News