Friday, November 22, 2024

రాష్ట్రంలో మున్సిపాలిటీలకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు మహర్దశ వచ్చిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సిఎ ం కెసిఆర్ గ్రామీణ పట్టణ ప్రగతి లక్షంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.శుక్రవా రం కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవా ల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో మున్సిపాలిటీల ప్రగతికి పట్టం కట్టారని అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా 36.76 కోట్లతో మిషన్ భగీరథ ఇతర పనుల ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వడ ం, స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే నిధుల నుంచి ప్రతి వార్డులో మౌ లిక వసతులు కల్పన మురుగునీటి పారుదల, సిసి రోడ్ల నిర్మాణం కోసం 3.75 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నానని ఎమ్మెల్యే అన్నారు.

రాను న్న రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నా లుగు జాతీయ రహదారులు వెళ్తున్నాయని కల్వకు ర్తి పట్టణానికి, మున్సిపాలిటీకి గొప్ప భవిష్యత్తు ఉందన్నారు.20వేల కోట్ల రూపాయలతో నూతన ంగా నిర్మించే ట్రిపుల్ ఆర్ రోడ్డుతో కల్వకుర్తి ప్రా ంత భూములకు విపరీతమైన డిమాండ్ రానుందని ఆయన అన్నారు. మున్సిపాలిటీ నిరంతర అభివృద్ధి కి నిరంతర కృషి చేస్తున్న చైర్మెన్, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అనంరతం ఉత్త మ సేవలు అందించిన అసిస్టెంట్ ఇంజనీర్ శివ, పారిశుద్ధ కార్మికులను ఆయన అభినందించి ప్రశ ంసా పత్రాలను, షీల్డ్‌లను అందజేశారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కల్వకుర్తి మున్సిపాలిటీ ప్రగతి నివేదికను విడుదల చేశారు.
* హరితహారానికి పది శాతం నిధులు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో శరవేగం గా అభివృద్ధి జరుగుతుందని అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. కల్వకుర్తిలో జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, పచ్చదనానికి మున్సిపల్ బడ్జెట్‌లో పది శాతం నిధులు కేటాయించడం గొప్ప అంశమని అన్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీల ప్రజలకు మౌలిక వసతులు, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పల్లె, పట్టణాల అభివృద్ధి కోసం చూస్తే ప్రభుత్వానికి స్థానిక సంస్థలు మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎంత శ్రద్ధ ఉందో తెలియవస్తుందని ఆయన అన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం చూ స్తుందని అదనపు కలెక్టర్ అన్నారు. హరితహారంతో 7 శాతం అడవులు పెరిగాయని, కల్వకుర్తి మున్సిపాలిటీకి హరితహారం అవార్డు రావడం జరిగిందన్నారు. మున్సిపాలిటీలకు జాతీయ స్థాయిలో అ వార్డులు వచ్చాయని మను చౌదరి అన్నారు.

మంత్రి కెటిఆర్, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ల సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి : చైర్మన్ ఎడ్మ సత్యం
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, పురపాలక శాఖ మ ంత్రి కెటిఆర్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతోనే కల్వకుర్తి మున్సిపాలిటీ శరవేగం గా అభివృద్ధి పథంలో నడుస్తుందని మున్సిపల్ చై ర్మన్ ఎడ్మ సత్యం అన్నారు. మున్సిపాలిటీలో ప్రజలకు మౌలిక వసతులతో పాటు త్రాగునీరు, పార్కు లు, ఇతర సౌకర్యాలను కల్పించడం జరిగిందని, కోట్ల రూపాయలను మంజూరు చేయించిన ఎమ్మె ల్యే జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్ మను చౌదరికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్, వైస్ చైర్మన్ షాహిద్, పిఎసిఎస్ చైర్మెన్ శ్రీశైలం, యా దమ్మ, సైదులు గౌడ్, మనోహర్ రెడ్డి, సౌజన్య, చై తన్య కిశోర్ రెడ్డి, మధు, వైస్ ఎంపిపి గోవర్ధన్, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్లు జమ్ముల శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News