Saturday, December 21, 2024

గ్రామీణ లింకు రోడ్లకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు మండల పరిధిలోని పలు గ్రామాల లింకు రోడ్లకు మహాదశ పట్టబోతుందని మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరై న గొర్రెల యూనిట్లను పరిశీలించారు. మండల కేంద్రంలోని ఒకటో వార్డులో జరగుతున్న డ్రైనేజి, సిసి రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో మునుగోడు నియోజకవర్గ రూపురేఖలను మార్చి అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని అన్నారు.

ఉప ఎన్నిల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా మంత్రులు కెటిఆర్, గుంతకండ్ల సహకారంతో మండలంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామిలకు కట్టుబడి ఉన్నామని, అన్ని రకాల అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. లింకు రోడ్లకు సంబందించి అనుమతులు వచ్చాయని, టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే పనులు మొదలు అవుతాయని, అతి త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపిపి కర్నాటి స్వామియాదవ్, మండల పార్టీ అధ్యక్షులు బండ పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్థన్ రెడ్డి , తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News