Tuesday, December 24, 2024

కరీంనగర్ – హైదరాబాద్ మధ్యలో ప్రయాణానికి మహర్దశ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హైదరాబాద్‌లోని జేబీఎస్ నుండి శామీర్‌పేట మధ్యలో డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో కరీంనగర్ – హైదరాబాద్ మధ్యలో ప్రయాణానికి మహర్దశ కలుగనుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఈ పనులు పూర్తి అయ్యే నాటికి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

కరీంనగర్ మార్గంలో హైదరాబాద్ నుండి శామీర్‌పేట వరకు 18.5 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు హైదరాబాద్‌కు సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలతో కలిసి తాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిపిన చర్చల ఫలితంగా ఈ ప్రతిపాదనలు కొలిక్కి వచ్చినట్లు తెలిపారు. ఈ ఐదు జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సులువుగా హైదరాబాద్ చేరుకునేందుకు శామీర్‌పేట – హకీంపేట – బొల్లారం – అల్వాల్ – కార్ఖానా – తిరుమలగిరి – జింఖానా గ్రౌండ్స్ మధ్య డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గమని వినోద్‌కుమార్ తెలిపారు.

ఈ మేరకు ఐదు జిల్లాల ప్రజలు సాఫీగా హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేందుకు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరడంతో కేంద్ర అధికారులు రాష్ట్ర హెచ్‌ఎండీఎ అధికారులను సంప్రదించి డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణం పనులకు అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించే అంశంపై చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఈ విషయం కొలిక్కి వచ్చి డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టనున్నారని, కరీంనగర్ ప్రయాణానికి మహర్దశ కలుగుతుందని వినోద్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News