Monday, December 23, 2024

మిషన్ కాకతీయతో చెరువులకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగు నీటి దినోత్సవాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నందు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి హాజరైన అశ్వారావుపేట నియోజవర్గ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావుకు నీటిపారుదల శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎంపిపి జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, దమ్మపేట ఎంపిపి సోయం ప్రసాద్ కార్యక్రమలో మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన పనులను రైతులకు వివరించారు.

అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగం దూసుకుపోతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనతో మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చెరువుల మట్టి పూడికను తీయించి చెరువులలో భూగర్భ జలాల గణనీయమైన మార్పులు వచ్చాయని, చెరువుల పూడికతీత పనులు చేసి ఆయకట్ట రైతులను ఆదుకున్నారని, అదేవిధంగా నియోజకవర్గాల్లో పెద్ద వాగు ప్రాజెక్టు, మూకమామిడి ప్రాజెక్ట్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా పంటలకు సాగు నీటి ప్రాధాన్యత కల్పించారని, కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, భూగర్భ జలాలు పెరిగాయని, పంట్ల దిగబడి పెరిగిందని, తాగునీటి కోసం ఇబ్బందులు తప్పయని అన్నారు.

జిల్లాలో 280 కోట్లతో చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టారని, నియోజకవర్గంలో లక్ష తొమ్మిది వేల ఆయకట్టు పంట సాగునీరు అందుతుందని, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 8000 కోట్లతో నిర్మాణం చేపడుతున్నారని, అది పూర్తయిన వెంటనే 3 లక్షల 87 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల కంటికి రెప్పలా చూసుకుంటున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు. అనంతరం సాగునీటి దినోత్సవ సభకు వచ్చిన రైతులకు అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చీప్ ఇంజనీర్, ఇరిగేషన్ అధికారులు, అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపలి,్ల చంద్రుగొండ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News