Wednesday, January 22, 2025

విశ్వకర్మ యోజనతో చేతివృత్తులకు మహర్దశ

- Advertisement -
- Advertisement -
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్ బాబు

వరంగల్ కార్పొరేషన్:- విశ్వకర్మ యవజన పథకంను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన సంధర్బంగా నగరంలోని విశ్వకర్మ వ్యాపార వాణిజ్య కులవృత్తుల కార్మికులు వరంగల్ చౌరస్తాలో దేశ ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిదిగా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ బాబు, పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచి సంభరాలు నిర్వహించారు.

అనంతరం సతీష్ మాట్లాడుతూ, విశ్వకర్మ, యోజన పథకంతో విశ్వ బ్రాహ్మణులు తదితర కులవృత్తుల వారికి 2లక్షల వరకు రుణం ఇవ్వనుందని గరిష్టంగా 5 శాతం వడ్డీతో ఈ రుణాన్ని అందించ నుందని తెలిపారు. చేతివృత్తుల వారికి రోజుకు 500ఉపకార వేతనంతో పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత పరికరాల కొనుగోలుకు 15వేల ఆర్థిక సాయం అందింస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని చేతి వృత్తుల కార్మిక సోధరులను కోరారు.

ఈ కార్యక్రమంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ వరంగల్ జిల్లా కన్వీనర్ శ్రీ రామోజు మోహనాచారి, గ్రేటర్ వరంగల్ విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు ఉల్లి వెంకట్, కట్ట ఈశ్వర్ ప్రాసాద్ వరంగల్ విశ్వబ్రాహ్మణ మాజీ జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులు వంగాల శ్రీనివాస్, గ్రేటర్ వరంగల్ విశ్వబ్రాహ్మణ కార్యదర్శి కందుకూరి రాజు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News