Monday, December 23, 2024

రాష్ట్రంలో సర్కారు బడులకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

బీర్‌పూర్: రాష్ట్ర ప్రభు త్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సం స్కరణల ఫలితంగా రా ష్ట్రంలో విద్యా వ్య వస్థలో మంచి ఫలితాలు వచ్చాయని జగి త్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్ కు మార్ అన్నారు. మండలంలోని తుం గూరు గ్రామంలో మండల పరిషత్ ప్రా థమిక పాఠశాలలో మన ఊరు మన బ డి కార్యక్రమంలో భాగంగా రూ.20 ల క్షల 81 వేల పూర్తి చేసిన అభివృద్ధి పను లను జగిత్యాల ఎంఎ ల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం విద్యా ర్థులకు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన యువకుడు అజయ్ పాఠశాల విద్యార్థుల కోసం లక్ష రూపాయలు ఎంఎల్‌ఎ చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సం స్థలకు పెరిగిన విద్యార్థుల వలసలు 2022 నుంచి 2023 విద్యా సం వత్సరంలో లక్ష విద్యార్థులు ప్రభు త్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యా విధానం, ఇం గ్లీషు మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, మన ఊరు మన బడి కార్యక్రమల వల్ల విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు.

దేశంలోకెల్లా అత్యధిక గు రుకుల విద్యాలయాలు కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 19 బిసి రెసి డెన్షియల్ పాఠశాలలు ఉంటే నేడు 207 పాఠశాలలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రా ష్ట్రంలో జరిగే అన్ని విద్య, ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్‌లను అమలు చేయడం జరుగుతోందన్నారు. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అ న్నారు. బీర్‌పూర్ మండలానికి ప్రాథమిక చికిత్స కేంద్రం మంజూరు చేయడం జరిగిందని, అత్యాధునిక 108 అంబులెన్స్ సైతం మంజూరు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి పాత ప ద్మరమేష్, కెడిసిసి జిల్లా సభ్యులు ముప్పాల రాంచందర్‌రావు, సర్పంచ్ గుడిసె శ్రీమ తిజితేందర్‌యాదవ్, ఎంపిటిసి ఆడెపు మల్లీశ్వరి, ఎంపిడిఓ మల్లారెడ్డి, ఎంపిఓ రామకృష్ణ రాజు, ఎఇఓ భీమయ్య, ఆర్‌ఐ శ్రీనివాస్, కార్యదర్శి ఉపేంద్ర, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కొల్ముల రమణ, స ర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం రమేష్ గౌడ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు గంగాదర్, శ్రీనివాస్‌రావు, సోషల్ మీడియా కన్వీనర్ వినోద్, ఆడెపు రవి, గం గరాజం, మిట్టపల్లి గంగన్న, చుక్క రమేష్, వడ్లూరి తిరుపతి, మండల యూత్ ఉపాధ్యక్షుడు సుద్దాల అ శోక్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News