Thursday, January 23, 2025

సోమశిల సిద్ధేశ్వరం ఐకాన్ వంతెనతో మహార్దశ

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద నిర్మించనున్న ఐకాన్ వంతెన నిర్మాణం, నేషనల్ హైవే ఏర్పాటుతో కొల్లాపూర్ ప్రాంత రూపురేకలు మారనున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రర్‌నాథ్ పాండే అన్నారు. సోమశిల వద్ద ఐకాన్ వంతెన నిర్మాణ స్థలాన్ని ఆదివారం అధికారులతో కలిసి మరబోట్లలో వెళ్లి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టే స్థలం వద్ద మ్యాప్ ద్వారా అధికారులు, బిజెపి నాయకులు ఎల్లేని సుధాకర్‌రావు, దిలీపాచారీలు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ కృషితో మారుమూల ప్రాంతానికి జాతీయరహాదారి మంజూరు చేసి సర్వే పనులు సైతం పూర్తి చేశామన్నారు. కృష్ణానదిలో మరబోట్లతో సహాసం చేస్తున్నారని ఐకాన్ వంతెన నిర్మాణం పూర్తయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మద్య దూరం తగ్గు తుందన్నారు.

హైదరాబాద్ నుంచి తిరుపతికి సుమారు 80కిలోమీటర్ల దూరం తగ్గనున్నదన్నారు. కల్వకూర్తి నుంచి సోమశిల మీదుగా నంద్యాల వరకు నిర్మించే నేషనల్ హైవే, ఐకాన్ బ్రిడ్జికి కేంద్రం రూ.14వందల కోట్లు ఖర్చు చేయ నున్నదన్నారు. అంతకు ముందు ప్రసిద్ధ పున్యక్షేత్రం అయిన సోమశిలలోని లలితా సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు. అనంతరం కొల్లాపూర్ పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి తెలంగాణ సంస్కృతి భాగమైన బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు తదితరులున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News