Friday, November 22, 2024

కెసిఆర్ హయంలోనే ఆలయాలకు మహర్ధశ

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని సేవలాల్ తాండా గ్రామంలో బుధవారం రూ. 22 లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీ జగదాంబ సే వాలాల్ విగ్రహ ప్రతిష్టాపన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎ మ్మెల్యే విఠల్ రెడ్డి మండల నాయకులతో కలిసి నిర్వహించారు.

ఈ స ందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమం,అబివృద్ధ్దిలతో పాటు గ్రామ గ్రామాన అన్ని కులాల, మతాల ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయించి నిర్మిస్తుందని తెలిపారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం అన్న పదానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి జరుగుతున్న అభివృద్ధియే నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ యశోదబాయి, జడ్పిటిసి లోలం కళావతి, గంగారాం, ఎంపిపి లలితా భోజన్న, సింగిల్‌విండో చైర్మెన్ రత్నాకర్ రావు, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, సోష ల్‌మీడియా అధ్యక్షుడు బండి ప్రశాంత్, ఆలయ కమిటీ చైర్మన్ ఆడే ఉత్తం, పిఎసిఎస్ డైరెక్టర్ సుదీర్ రెడ్డి, నాయకులు విజయ్, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News