Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ పాలనలో గ్రామాలకు మహర్ధశ

- Advertisement -
- Advertisement -

మానవపాడు : ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన గ్రామాలకు మహర్ధశ అని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు , రూ. 5 లక్షలతో డ్రైనేజీ పనులు రూ. 10 లక్షలతో బుడగ జంగాల వారి కమ్యూనిటి హాల్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధ్ది చేస్తామని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధ్ది కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసిఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్షంతో ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మిదేవి, వడ్డేపల్లి జడ్పీటీసీ కాశపోగు రాజు, బీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, వెంకట్రాముడు, అనంతరెడ్డి, మహ్మద్ , శంకర్‌గౌడ్, ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News