Wednesday, December 25, 2024

ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చిన మహర్షి సిఎం కేసీఆర్

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : ప్రతి ఇంటి మంచినీటిని ఇచ్చిన మహర్షి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజేంద్రనగర్ శాసన సభ్యుడు టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు.ఆదివారం తెలంగాణదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఉప్పర్‌పల్లి ఎస్‌బిఆర్ గార్డెన్స్‌లో మెట్రో వాటర్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించి ‘తెలంగాణ మంచినీళ్ల పండుగ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా అత్తాపూర్‌లోని సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌ను ఆయన అధికారులతో కలసి పరిశీలి, జడ్పీహెచ్‌ఎస్‌లో వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణతో ప్రకృతి నియమాలకు అనుగుణంగా రాష్ట్రం మొత్తం ప్రతిఇంటికి త్రాగునీరు అందించాలని కంకణ బద్దుడై కార్యదీక్షతతో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించిన మహర్షి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు.కృష్ణనీళ్ల రాకతెఓ ఎన్నో ఏళ్లుగా ఆడబిడ్డలు పడ్డ నీటి కష్టాలు కంటికి కూడా కానరాకుండా పోయాయన్నారు. నేడు తెలంగాణలో ప్రతి ఇంటి వాకిట్లో పుష్కలమైన నల్లా నీరు వస్తున్నాయన్నారు. ఈకార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, వాటర్ బోర్డు ఎస్‌జిఎం చంద్రశేఖర్, బిఆర్‌ఎస్‌పార్టీ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, శ్రీరామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News