Monday, December 23, 2024

సూర్యదేవాలయంలో మహసౌరయాగం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో ఉన్న అఖండజ్యోతి సూర్యనారాయణ క్షేత్రంలో ఆదివారం వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీ రితో పాటు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, లావణ్య దంపతులు , ఎన్‌ఆర్‌ఐ పటేల్ శ్రీధర్ రెడ్డి పద్మావతి దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సంధర్బంగా పటేల్ రమేష్ రెడ్డి మా ట్లాడుతు సూర్యదేవాలయం రానున్న రోజుల్లో ఎంతో ప్రసిద్ది చెందుతుందని దేవాలయ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని అభివృధ్దికి ఎప్పుడయిన సహకరిస్తానని వారన్నారు. అనంతరం స్వామి వారి మహసౌరయాగంలో భక్తులు పాల్గోని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కాకులారపు జనార్థన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News