Thursday, January 23, 2025

మహాశివుడి పూజకు.. అంతా సిద్దం.. హైదరాబాద్‌లో శివాలయాలు

- Advertisement -
- Advertisement -

మహాశివరాత్రి పర్వదినం వేడుకలను పురస్కరించుకుని నగరంలో ఆప్పుడే ఆధ్యాత్మికత సంతరించుకుంది. నగరంలోని అన్ని శివాలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పత్యేక రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీపమాణ్యంగా వెలిగి పోతున్నాయి. నగరం వివిధ ప్రాంతాలలోని ఉన్న శివాలయాలకు భక్తులు పోటేత్తనుండడంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల నుంచే మహా శివుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజాలు, అభిషేకాలకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయా కమిటీలు ఇప్పటికే పూర్తిచేశారు. మాదాపూర్, బిరంగూడ, కర్మన్ ఘాట్, దిల్‌సుఖ్ నగర్, మల్కాజిగిరి, మారెడ్‌పల్లి, పేట్ బషీరాబాద్, వీరన్న గుట్ట శ్యాంమందిర్‌లోని శివాలయం, పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, పురానా పూల్ శివాలాల్ ఘాట్, చార్మీనార్ మహాదేవ్ మందిరం, స్పటిక లింగ క్షేత్రమైన నాగోల్‌తోపాటు వివిధ ప్రాంతాలోని శివాలయాలు, మల్లికార్జున స్వామి దేవాలయాలతో పాటు అన్ని ఆలయాలను ప్రత్యేకంగా అలకరించారు.

ఉపవాస దీక్షల నేపథ్యంలో భక్తులు తమకు అందుబాటులో ఉన్న ఆలయాలను సందర్శించి ఉపవాస దీక్షలను వీడవనుండడంతో ఆయా ఆలయ కమిటీలకు ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. అదేవిధంగా మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇప్పటీకే నగరవాసులు ప్రసిద్ద శైవ కేత్రాలైన వేముల వాడలోని రాజరాజేశ్వరి ఆలయం, కీసరగుట్టలోని రామలింగేశ్వర దేవాలయానికి తరలి వెళ్లారు. శివరాత్రి రోజు శుక్రవరం మరింత మంది నగర భక్తులు కీసరగుట్టకు తరలివెళ్లనుండడంతో ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులను నడపనుంది.

మండుతున్న పండ్లు, కూరగాయాల ధరలు 
మాహా శివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా పండ్లు, కూరగాయాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. శివరాత్రి సందర్భంగా పండ్ల మార్కెట్లకు భక్తులు పొటేత్తడంతో వ్యాపారులు ఒక్కసారి ధరలను పెంచేశారు. దీంతో పండ్ల ధరలను చూసి నగరవాసులు ఒక్కసారిగా ఆవాక్కు అయ్యారు. శివరాత్రి పర్వదినం రోజున శివుడికి ఉపవాస దీక్షలు పాటించే భక్తులందరు సాయంత్రం వేళ్లల్లో పండ్లతోనే దీక్షను విరమిస్తారు. దాదాపు ఎప్పుడో గాని పండ్ల ముఖం కూడా చూడని నిరుపేదలు సైత పండుగ పూట పండ్లను కొంటారు.

దీంతో వ్యాపారులు దీనిని అసరాగా చేసుకుని అన్ని పండ్ల ధరలను ఏకంగా రెండితల నుంచి ఐదింతలకు వరకు పెంచారు. ప్రధానంగా ఆపిల్, కమలం, అరటి, పుచ్చకాయ, అంగూర్, కర్జూరపండ్ల ధరలు అమాంతగా పెంచారు. మరోవైపు కూరగాయాల ధరలు సైతం భారీగా పెరిగాయి. శివరాత్రి జాగరం తర్వాత రోజున శివుడికి అన్ని కూరగాయాలతో వంటలు చేసిన నైవేధ్యంలో సమర్పిస్తారు. దీంతో భక్తులు అన్ని రకాల కూరగాయలు కొనడం అనివార్యం కావడంతో వ్యాపారులు ఇష్టరీతిన ధరలు పెంచి అమ్మకాలు కొనసాగించారు. పండుగ వేళా కావడంతో చేసేది లేక స్తోమత మేరకు కొనుక్కొని ఇంటికి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News