Monday, December 23, 2024

హరహర శంభో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కి టకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద శివుడిని దర్శించుకోవడానికి పె ద్దసంఖ్యలో భక్తులు బారులుతీరారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో దీపారాధన చేపట్టా రు. ఇక రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గాభవానీమాత ఆలయం, మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట, జోగులాంబ గద్వాల జిల్లాలోని జో గులాంబ ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని స్వామి, కోటగు ళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, హైదరాబాద్‌లో బంజారాహిల్స్, వనస్థలిపురం, ఓల్డ్‌సిటీలో పలు శివాలయాల్లో భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో…

ఉమ్మడి నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరాలయం, నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, దామచర్ల మండలంలోని వాడపల్లి శైవాలయం, నల్లగొండలోని పానగల్లు చాయా సోమేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలోని చారిత్రక కాకతీయుల శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం, వాడపల్లి అగస్తీశ్వర స్వామి లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వేములవాడ రాజన్న ఆలయానికి భారీగా….

రాజన్న సిరిసిల్లలోని వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పట్టింది. గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను అధికారులు రద్దు చేశారు. శని, ఆదివారాల్లో భక్తులకు లఘు దర్శనం కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ నుంచి భక్తులు భారీగా ఈ ఆలయానికి తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించారు. మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు.

వేయిస్తంభాల దేవాలయం, రామప్ప టెంపుల్

వరంగల్ జిల్లాల్లోని శైవక్షేత్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేయిస్తంభాల దేవాలయం, రామప్ప టెంపుల్, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి హరీష్‌రావు

మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం నుంచి మూడు రోజులపాటు జాతరను నిర్వహించనున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు పట్టువస్త్రాలు సమర్పించారు. జాతర నేపథ్యంలో హైదరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి 200 ప్రత్యేక బస్సులను ఆర్టీసి ఏర్పాటు చేసింది.

సిద్దిపేట జిల్లాలో…

సిద్దిపేట జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరాడాయి. కొమురవెళ్లి, కోటిలింగాల, పోట్లపల్లి, శరభేశ్వర ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో శివుడికి ఉదయం నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అభిషేకాలను నిర్వహించారు. సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వేములవాడ కామన్ వద్ద శివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గోదావరి నదిలో పుణ్యస్నానాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి సందర్భంగా కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలోని శివాలయం, సుజాతనగర్ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బూర్గంపాడు మండలం మోతె గడ్డ ఆత్మలింగేశ్వరస్వామి శివాలయానికి, పాల్వంచలో కాకతీయుల కాలం నాటి శివాలయంలో మహశివరాత్రి పర్వదినం రోజున శివలింగంపై పడే సూర్య కిరణాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. బాసర, బ్రహ్మపురి, సోన్, ఖానాపూర్, కలమడుగు, మంచిర్యాల, చెన్నూరు గోదావరి తీరాల్లో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మంచిర్యాల జిల్లా శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేలాల గట్టు మల్లన్న, కత్తరశాల మల్లిఖార్జున స్వామి ఆలయాల్లో శివరాత్రి జాతరకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొమురం భీం జిల్లాలోని ఈస్ గాం శివ మల్లన్న ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

నిజామాబాద్ జిల్లాలో

నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. నిజామాబాద్ కంఠేశ్వర్, బోధన్ ఏక చక్రేశ్వర్, బిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం, మద్దికుంట బుగ్గ రామేశ్వరాలయం, బండ రామేశ్వర్ పల్లి శివాలయం, కామారెడ్డిలోని ఓంకారేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

ఖమ్మం జిల్లాలో…

ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. నీలాద్రీశ్వరస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఖమ్మం నగరంలోని స్వయంభు శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి సహిత భోగలింగేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆయా ఆలయాల్లో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలను నిర్వహించారు.

మహబూబాబాద్ జిల్లాలోని…

మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం కాట్రపల్లిలోని పురాతన శివాలయానికి వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరారు. ఆ నీలకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News