Sunday, December 22, 2024

షాక్‌తోపాటు నా కల నిజమైంది అనిపించింది

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ’భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సంగీత దర్శకుడు మణిశర్మ వారసుడు కీబోర్డ్ ప్లేయర్ మహతీ స్వరసాగర్ భోళా శంకర్ సినిమాకు బాణీలు సమకూర్చారు.

ఆగస్టు 11న విడుదలకానున్న ఈ సినిమా గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మా నాన్నగారి బర్త్‌డేకు మెహర్ రమేష్ హాజరయ్యారు. ఆ సందర్భంలో చిరంజీవి సినిమా నువ్వు చేస్తున్నావ్… అని అన్నారు. నేను నమ్మలేదు. జోక్ చేస్తున్నారు అని భావించా. కానీ తర్వాత రోజు కథ చెప్పారు. షాక్‌తోపాటు నా కల నిజమైంది అనిపించింది. సహజంగా నేను ఏ సినిమాకు మా నాన్న సలహాలు తీసుకోలేదు. కానీ ఈ సినిమాకు తప్పలేదు. నాకంటూ ఒక స్టయిల్ నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నం ఈ సినిమా.

ఈ సినిమా ట్యూన్ కట్టాక ప్రతీదీ నాన్నకి వినిపించాను. ఇంకా ఏమైనా బెటర్ చేయాలా! అని అడిగాను. ఆయన తగిన సూచనలు ఇచ్చారు. స్టైలిష్ దర్శకుడు మెహర్ రమేష్ వుండడంతో కొత్త ఆలోచనలతో సౌండ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. చిరంజీవి పాటలంటే కొన్ని లిమిటేషన్స్ వుంటాయి. డాన్స్ మూవ్‌మెంట్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ సినిమా ట్రావెల్‌లో చిరంజీవి చాలా ఐడియాలు ఇచ్చారు. ఈ సినిమాలో చిరంజీవికి జామ్ జామ్ జజ్జెనక.., మిల్కీబ్యూటీ పాటలు బాగా నచ్చాయి. ఇక ప్రస్తుతం నారా రోహిత్ నటిస్తున్న ప్రతినిధి 2, గోపీచంద్‌తో ఓ సినిమా, అలాగే నా స్నేహితుడు దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నాను” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News