న్యూఢిల్లీ : మహాత్మా గాంధీకి అత్యంత ఇష్టమైన ‘ అబైడ్ విత్ మీ’ అనే గీతాన్ని ఈ ఏడాది నుంచి బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో తొలగిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అజాదీ కా అమృతోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో బారతీయ గీతాలు వినిపించడం సమంజసంగా పేర్కొన్నాయి. స్కాట్లాండ్‌కు చెందిన ఆంగ్ల కవి , గేయకారుడు హెన్నీ ఫ్రాన్సిస్ లైట్ ఈ గీతాన్ని 1847 లో రాశారు. 1950 నుంచి మనదేశంలో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో పాడుతున్నారు. అప్పటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవాల్లో అబైడ్ విత్ మి అనే గీతం వస్తుండగా, బీటింగ్ రిట్రీట్ మార్చ్‌తో పూర్తవుతుంది. అయితే ఈ ఏడాది నుంచి ఈ గీతాన్ని పాడటం లేదని శనివారం ఆర్మీ ప్రకటించింది.
అమృతోత్సవ్ సందర్భంగా జనవరి 29 ప భారతీయ గీతాలు ఆలపించడం సబవుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గీతం స్థానంలో ప్రముఖ రచయిత కవి ప్రదీప్ రాసిన ‘యే మేరే పతన్ కే లోగో ’ అనే గీతాన్ని ఆలపించనున్నట్టు భారత ఆర్మీ ప్రకటించింది. దేశ ప్రజలకు ఈ గీతమే అత్యంత అనుసంధానమని పేర్కొంది. 1962 లో భారత్ చైనా యుద్దం సందర్భంలో కవి ప్రదీప్ ఈ గీతాన్ని రచించారు. ఈ ఏడాది వేడుకల్లో 26 గీతాలు ఆలపించనున్నారు. హే కాంచా, చన్నా బిలౌరీ, జై జన్మభూమి, నృత్యసరిత, విజయ్ జోష్, కేసరియా బన్నా, వీర్ సియాచిన్, హత్రోయి, విజయ్ ఘోష్, లడకూ, స్వదేశీ, అమర్ చట్టన్, గోల్డెన్ యారోస్, స్వర్ణజయంతి, తదితర గీతాలు ఆలసిస్తారు. ఈ గీతాల వాద్య సహకారంగా 44 బగ్లర్లు, 16 ట్రంపెటర్లు , 75 డ్రమ్మర్లు తమ వాద్యాలను వినిపిస్తారు.